MDK: విధి నిర్వహణలో పోలీసులకు క్రమశిక్షణ అవసరమని తూప్రాన్ డీఎస్పి నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలో సర్కిల్ పరిధి పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించారు. పరేడ్‌కు తూప్రాన్ డీఎస్పి నరేందర్ గౌడ్ హాజరై పరిశీలించారు. పలు సూచనలు చేస్తూ, విధుల్లో నాణ్యమైన పనితీరు కనబరచాలని పేర్కొన్నారు. సీఐ రంగ కృష్ణ, ఎస్సై శివానందం, యాదగిరి పాల్గొన్నారు.