AKP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతకు కృషి చేస్తామని కోటవురట్ల మండలం పాములవాక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు శనివారం ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో హెచ్ఎం వై.రామారావు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. తర్వాత మొక్కలు నాటారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.