ప్రముఖ రచయిత, దర్శకుడు ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. బాల్యంలోనే నటుడిగా నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత బాలల పత్రికలకు కథలు రాశారు. దాదాపు 80 మూవీలకు కథ, మాటలు రాశారు. 200 కథలు, 20 నవలలు, 800కిపైగా TV ఎపిసోడ్స్‌కి రచన చేశారు. సినీ, నాటక రంగాల్లో 13 నంది పురస్కారాలను అందుకున్నారు.