ELR: కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో ఇవాళ ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు తోట రవి, సరిపల్లి సర్పంచ్ తాడేపల్లి గోపి, వీఆర్వొ రాంబాబు, పంచాయతీ అధికారులు, సరిపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గ్రామాల్లో చెత్త ఎక్కడబడితే అక్కడ వేయకూడదని తోట రవి తెలిపారు.