HYD: నగరంలో సురేంద్ర అనే వ్యక్తి “చావు పిలుస్తోంది” అంటూ బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సురేంద్ర మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.