NRML: విశ్వబ్రాహ్మణుల సాంస్కృతిక సాధికారికత, రాజకీయ చైతన్యం కోరుతూ విశ్వనాథుల పుష్పగిరి ఆదిలాబాద్ నుంచి చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్‌కు చేరుకుంది. వారు మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులలో రాజకీయ సాంస్కృతిక చైతన్యం తీసుకువచ్చేందుకు 1500 కి.మీ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.