సత్యసాయి: సోమందేపల్లిలో ప్రతిరోజూ పశువులు రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. దీనిపై సోమందేపల్లి ఎస్ఐ రమేశ్ బాబు స్పందించారు. ఈరోజు నుంచి ఇలా రోడ్లు పైన వదిలిన పశువులన్నిటిని కూడా గోశాల తరలించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళపై కేసు నమోదు చేస్తామన్నారు.