HYD: జిల్లా పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించేందుకు నిర్ణయం జరిగినట్లుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన తెలియజేసారు. ఈ నేపథ్యంలో జూనియర్ డిగ్రీ కళాశాలలో విస్తృతంగా పర్యటించి మౌలిక సదుపాయాలను తెలుసుకోవడంతో పాటు, భూముల కేటాయింపు అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు.