మెగా హీరో సాయి దుర్గా తేజ్ మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయన నటించనున్నారట. దీనికి దర్శకుడు మారుతి కథను అందించనుండగా.. డార్లింగ్ స్వామి మాటలు అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక సాయి ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ మూవీతో బిజీగా ఉన్నారు.