2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని రకాల వాహనాలకు ఈ నెల 30లోపు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే, గడువు సమీపిస్తున్నప్పటికీ వాహనదారులు, RTO అధికారులు దీనిపై ఎలాంటి ఆసక్తి కనబర్చడం లేదు. HSRP ప్లేట్లు వాహనాల భద్రతను మెరుగుపరుస్తాయి. దొంగతనాలు జరిగినా వెంటనే ట్రాకింగ్ సులభం చేస్తాయి.