SRD: అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని బొంతపల్లి వీరభద్ర స్వామి వారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో రుద్ర హోమం చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య హోమాన్ని ప్రారంభించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు సోమయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.