‘పెద్ది’ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. దర్శకుడు సుకుమార్‌తో సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగా సుకుమార్ వ్యవహరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ప్రీ విజువలైజేషన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు టాక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.