KRNL: ఆదోని పట్టణంలో ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇవాళ ఉదయం కూటమి నాయకులతో కలిసి గోడపత్రికను విడుదల చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మారుతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.