అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచారు. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని వ్యాఖ్యానించారు.