అన్నమయ్య: మదనపల్లిలోని స్థానిక నిమ్మనపల్లి రోడ్డులోని GMR పాలిటెక్నిక్ కళాశాలలో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.