KDP: యోగి వేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్- 9 ఆధ్వర్యంలో డా.కె. శ్రీనివాసరావు నాయకత్వంలో చింతకొమ్మదిన్నె మండలంలోని శివాజీనగర్ గ్రామంలో శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వాలంటీర్లు 350 మొక్కలు నాటినట్లు ప్రోగ్రాము ఆఫీసర్ తెలిపారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.