ప్రముఖ బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ మృతి చెందాడు. నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ వెళ్లిన ఆయనకు సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో CPR చేసి, స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.