SKLM: మందస మండలంలోని చికిడిగాం, కురడాలు,బాలిగాం,మొగిలిపాడు,లింబుగాం గ్రామాలలో టీడీపీకి మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ పర్యటించారు. ఈ మేరకు స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.