KDP: జిల్లాలో ఉల్లి సాగుచేసిన రైతులకు నష్టం కలగకుండా మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం జేసీ అతిథి సింగ్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఉల్లి నిల్వలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెఫెడ్ అధికారులు ప్రతిపాదనలు పంపాలన్నారు.