VSP: విశాఖ నగరంలో వివిధ కారణాలవల్ల స్వాధీనం చేసుకున్న వాహనాలను సీపీ వాహనదారులకు తిరిగి అందజేశారు. పోలీస్ గ్రౌండ్లో శుక్రవారం సీపీ శంఖబ్రత బాగ్చి 346 వాహనాలను వాహనదారులకు అందజేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఇప్పటివరకు మూడు వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించి 818 మందికి వారి వాహనాలు అందించినట్లు వెల్లడించారు.