AKP: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎం ఎంఎస్ఎం ఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కలిసి వినతి పత్రం అందజేశారు. అచ్యుతాపురంలో గల ఎంఎస్ఎం ఈ పార్కులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించాలని కోరారు.