AP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకు నీళ్లు తరలించవచ్చని CM చంద్రబాబు తెలిపారు. రూ.960 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 75% పూర్తి అయ్యాయని అన్నారు. రూ.1425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానించామని చెప్పారు. పదేళ్లలో 439 TMCలు కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని.. శ్రీశైలంలో నిల్వ చేసిన నీళ్లు సీమ, హంద్రీనీవా, గాలేరు-నగరికి తరలించామని వివరించారు.