VSP: స్వచ్ఛతా హీ సేవా – 2025 కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన స్వచ్ఛోత్సవ్ పోస్టర్లను విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి మొదలైన స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలు అక్టోబర్ 02వ తేదీ వరకు కొనసాగుతాయని డీపీవో శ్రీనివాసరావు ఈ సందర్భంగా చెప్పారు. పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.