అన్నమయ్య: నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజంపేట పార్లమెంట్ సీనియర్ జనసేన నాయకుడు రామ శ్రీనివాస్ మిత్రబృందంతో కలిసి కలెక్టర్‌ను స్వాగతించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, గ్రామీణ-పట్టణ ప్రజాసేవ, రవాణా, రోడ్ల మరమ్మత్తులు, విద్య, ఆరోగ్యం, పేదల సేవలపై చర్చించారు.