W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో ఇవాళ బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ తీరప్రాంత మిషన్ పథకం కింద సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.