సత్యసాయి: మడకశిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోమేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. 11 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.