HYD: మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను పట్టపగలే చోరీ చేస్తున్నారు. వాకర్స్ లేని మధ్యాహ్నం వేళల్లో ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో సరైన లైట్లు లేకపోవడంతో ఆ ప్రాంతం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.