ప్రకాశం: స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న మర్లపాడులో ఎన్.టి.ఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ జరుగనుందని దామచర్ల సత్య శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, డోలాబాల వీరాంజనేయ స్వామి, MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు.