MBNR: జిల్లా కేంద్రంలో ఆది కర్మయోగి అభియాన్ బ్లాక్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమైనట్లు గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో ఈ కార్యక్రమం మొదలైందని వెల్లడించారు. ఎంపికైన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.