GNTR: గుంటూరు జిల్లాలో రైతుల కోసం రెండు అధునాతన డ్రోన్ పరికరాలను ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ప్రారంభించారు. రూ.9.80 లక్షల విలువైన ఈ డ్రోన్లను ప్రభుత్వం 80% సబ్సిడీతో ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులు కేవలం రూ.1.96 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. రామచంద్రపురంలో డ్రోన్లను రైతులకు అందజేశారు.