BHNG: బొమ్మలరామారం మండలం చీకటిమామిడి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలిపేట, రామునితండా, బోయిన్పల్లి, గ్రామాల ప్రజలు గత 12 సంవత్సరాలుగా రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.