చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన మూవీ ‘లిటిల్ హార్ట్స్’. అయితే ఈ మూవీ అక్టోబర్ 2 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను మేకర్స్ ఖండించారు. థియేటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పట్లో OTTలోకి రాదని, ఏదైనా ఉంటే తాము చెబుతామని చెప్పారు. ‘ఇలాంటి నకిలీ ఫొటోలను వ్యాప్తి చేస్తే మీద ఒట్టే’ అంటూ హెచ్చరించారు.