‘OG’ హైప్ గురించి స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తన స్టైల్లో పోస్ట్ పెట్టారు. ‘OG హైప్ ప్రభావం మా హెల్త్‌పై పడేలా ఉంది. 25 వరకు మేం ఉంటామో, పోతామో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక 25 తర్వాత పరిస్థితి ఏంటో?. మీరు పవన్ కాదు.. మీరు గాలి తుపాను’ అంటూ రాసుకొచ్చారు. దీనికి పవన్‌ను, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ ‘OG’ ఓ అద్భుతమని పేర్కొన్నారు.