W.G: మొగల్తూరు మండలం కాళీపట్నంలో ఒంటరిగా ఉంటున్న బళ్ల సూర్య ఆదిలక్ష్మి రాజేశ్వరి (55)పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. శనివారం జరిగిన ఈ ఘటనలో దుండగుడు ఆమె తలపై కర్రతో కొట్టగా స్పృహ కోల్పోయింది. ఈక్రమంలోనే గొలుసు తెంపుకొని పారిపోయాడు. రాజేశ్వరి నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.