KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 లోని శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో ఇవాళ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకుడు జింక సాంబయ్య అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు మంగళ గౌరీ దేవి అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.