తూర్పు గోదావరి జిల్లాలో 2025-26 ఖరీఫ్ వరి కొనుగోలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ కలెక్టర్ మాధవి లతకు వివరాలు అందించారు. 221 రైతు సేవా కేంద్రాల్లో అక్టోబర్ 10న వరి కొనుగోలు ప్రారంభం కానుందని తెలిపారు. జిల్లాలో 5.31 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.