NRML: ఉన్నత భవిష్యత్తు కోసం విద్యార్థులు బాగా చదువుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ సూచించారు. పెంబి తాండ మాజీ సర్పంచ్ కున్సోత్ కరుణ విలాస్ కుమార్ కుమార్తె కున్సోత్ చందన ఇటీవల ఎంబిబిఎస్ సీటును సాధించారు. దీంతో సోమవారం ఖానాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఆమెను జాన్సన్ నాయక్ శాలువా కప్పి సన్మానించారు.