NLR: వింజమూరు చెరువుకట్టపై అదుపుతప్పి సిమెంట్ లోడ్ లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లారీ బోల్తా కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకొన్నారు.