ప్రకాశం: కనిగిరి లోని దరువు వద్ద ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దేవి నవరాత్రులు ఇవాల ప్రారంభించారు. దేవీ నవరాత్రులు పురస్కరించుకొని ఈశ్వరి మాత దేవికి ఆలయ అర్చకులు ఆకుమల్ల విశ్వరూప చారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలత్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరిపారు.