W.G: పోడూరు మండలం తూర్పుపాలెం వైసీపీ కార్యాలయంలో మాజీమంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి బూత్ కమిటీల గురుంచి వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన బూత్ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలని పార్టీ శ్రేణులకు రంగనాథ రాజు సూచించారు.