TG: HYDలోని 20 ఇంజనీరింగ్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పలు కళాశాలలు పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డొనేషన్లు తీసుకొని అమ్ముకున్నారని, మెరిట్ ప్రాతిపదికన బీటెక్ సీట్లు కేటాయించలేదని పలు విద్యార్థి ఐకాస సంఘాలు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశాయి. దీంతో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.