KNR: సోమవారం జరిగిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీ క్షలకు 82% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు 37 మందికి గాను 32 మంది (91%), ఇంటర్ పరీక్షకు 73 మందికి గాను 58 మంది (79%) హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు నలుగురు హాజరయ్యారని వివరించారు.