WGL నగరంలో ఇటీవల డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 28 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 10మందికి మేజిస్ట్రేట్ అబ్బోజు వేంకటేశం 2రోజుల జైలుశిక్ష విధించగా హుజూరాబాద్ జైలుకు తరలించారు. మరో 18మందికి రూ.24,500 జరిమానా విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికి రూ.800 చొప్పున ఫైన్ వేసినట్లు సీఐ సుజాత తెలిపారు.