మోహన్ లాల్, మీనా కాంబోలో రానున్న మలయాళ మూవీ ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు ఇవాళ కేరళ తోడుపుజాలో పూజా కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను హీరో మోహన్ లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ సినిమా దృశ్యం-1, 2 మూవీలకు భిన్నంగా ఉంటుందని, ముందుగా మోహన్ లాల్ ప్రధానంగా సాగే సన్నివేశాలు చిత్రీకరిస్తామని డైరెక్టర్ జీతూ జోసెఫ్ గతంలో చెప్పారు.