అనంతపురం కలెక్టరేట్లో జరిగిన PGRS కార్యక్రమంలో 540 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఆనంద్ మీడియాకు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి, త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.