KDP: ఏపీలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పథకానికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ వెబ్సైట్లో పథకం పేరును చేర్చింది. ఇక నుంచి ఆటో డ్రైవర్లు ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వారికి ప్రతి ఏడాది రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.