కోనసీమ: ముమ్మిడివరం పోలీసు స్టేషన్ను బుధవారం రాత్రి కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పోలీస్ స్టేషన్లను సందర్శించి సిబ్బందికి ఆయన పలు సూచనలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆయన ఆదేశించారు.