PPM: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బుధవారం అమరావతి సవివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలసి నియోజకవర్గంలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నగర పంచాయతీ డంపింగ్ యార్డ్, GO నంబర్-3 పునరుద్ధరణ వంటి వివిధ సమస్యలను తెలియజేసినట్లు, సమస్యలను పరిష్కరిస్తానని, అవసరమైన నిధులను మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.