ELR: పెదపాడు పరిసరాల్లో చేపల చెరువులకు కోళ్ల వ్యర్ధాలు తరలిస్తున్న లారీని పోలీసులు తోటగూడెం వద్ద అడ్డుకున్నారు. విజయవాడ పరిసరాల నుంచి వచ్చిన లారీలో కోడి వ్యర్థాలను చెరువుల యజమానుల సహకారంతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్లతో పాటు పలువురు యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదపాడు SI కట్టా శారదా సతీశ్ తెలిపారు.