NGKL: అచ్చంపేట పట్టణానికి మంగళవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ రానున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ తాలూకా ఇన్ఛార్జి కృపానందం తెలిపారు. నియోజకవర్గంలోని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.